Monday, August 29, 2022

పార్వతి నందన పరమ నిరంజన

పార్వతి నందన  పరమ నిరంజన 

సిద్ధివినాయకా బాలగణేశా  

విద్యాదాయక బుద్ధిప్రదాయక

సిద్ధివినాయకా బాలగణేశా    

మునిజనవందిత సురవరపూజిత

సిద్ధివినాయకా బాలగణేశా   

మూషికవాహన దోషవినాశక 

సిద్ధివినాయకా బాలగణేశా  

Sunday, May 29, 2022

ప్రతి కణం లో అనంతం స్పందిస్తూ ఉంది

 

infinite thru finite

ప్రతి కణం లో అనంతం స్పందిస్తూ ఉంది 
ప్రతి క్షణం లో నిత్యం నివసిస్తూ ఉంది
ప్రతి శబ్దం లో నిశబ్దం నవ్వుతు ఉంది 

in every particle infinity is pulsating
in every second eternity is existing
in every noise silence is smiling 

ప్రతి వస్తువు కూడా తన అస్తిత్త్వం ద్వారా 
సర్వత్ర ఉన్న అనంతాన్ని ప్రకటిస్తూ ఉంది 

అనంతం తన ఉనికిని నేరుగా తెలుపడం లేదు 
పరోక్షం గానే తెలుపుతూ ఉంది 
ప్రపంచం లోని ప్రతి కణం ద్వారా 


every object thru its existence
pronouncing the all pervading infinity 

infinity is not expressing its presence directly 
it is expressing only indirectly thru every particle in the universe

Sunday, April 17, 2022

వుండు...

 

Be, వుండు...

వుండు 
నిండుగా

చెండులా

కమ్మని పండులా

తొణకని కుండలా

చిక్కులు లేని దారపు ఉండలా

తీయటి కలకండలా

హాయిగా చల్లగా వుండు అల లా

ఒక అందమైన కలలా

చందురుని వెన్నెలలా

be
full
like a ball whole
like a fruit delicious
 
like a filled vessel unperturbed
like a reel of thread, without knots
like a sugar candy sweet
like a ripple cool and pleasant
like a dream beautiful
 

like a moonlight soft

Tuesday, March 22, 2022

నేల విడిచిన సాము వద్దు

నేల  విడిచిన సాము వద్దు  

asdf jkl; టైపులో రెఫరెన్సు 

షడ్జము సరిగమల్లో 

 ఆధార స్వరం 

సివిల్ ఇంజినీరింగ్  లో బెంచ్ మార్క్  సముద్ర మట్టం 

గోల్ కీపర్ యథా స్థానం లోకి రావాలి 

తబలా కు లహరా రిఫరెన్స్ 

పిల్లకు తల్లి 

పక్షికి గూడు

బెంచ్ మార్కులు రెఫెరెన్సులు లేకపోతే 

ఆయా రంగాలలో కన్ఫ్యూజన్ ఖాయం 

 మరి 

జీవితానికే   రెఫెరెన్సు లేకపోతే ??

అన్ని రంగాలలో కన్ఫ్యూజన్ ,

మొత్తం అయోమయం 

అందుకే ఇన్ని బాధలు, సమస్యలు 

జీవితానికి అసలైన రెఫెరెన్సు అంతరంగం లోని పరా క్షేత్రం 

దానితో అనుసంధానం 

చేస్తుంది ఇహంను  ఆనందమయం  

  

మహర్షివర్యులు ఐక్యక్షేత్రం అనుభూతిని ప్రసాదించారు మానవాళికి

మహర్షివర్యులు ఐక్యక్షేత్రం అనుభూతిని ప్రసాదించారు మానవాళికి 

మోడరన్ టెక్నాలజీని టపాకాయలుగా అందించారు  జ్ఞాన  దీపావళికి 

ఐక్యక్షేత్రం అనుభూతి తో ఐంది 

మానవాళి 

జ్ఞాన దీపావళి  


మహర్షి నాకు నోట్లు ఇస్తే

మహర్షి నాకు నోట్లు ఇస్తే 

నేను చిల్లర మార్చుకొని 

మీముందు గలగలా శబ్దం చేస్తున్నా  

భూ భారం తగ్గించండి

భూ భారం తగ్గించండి  


ధ్యానం చేస్తే మనుష్యులు తేలికై భూమికి భారం తగ్గుతుంది 

తన భారం తగ్గించుకోడానికి 

భూమి ఒక్కోసారి కొందరిని 

వరదల ద్వారా భూకంపాల ద్వారా 

చంపేస్తుంది 

ప్రజలు ధ్యానం చేస్తే భూ భారం దానంతట తగ్గి 

అందరూ హాయిగా జీవించే అవకాశం కలుగుతుంది 

అంత సున్నితం గా ఉన్నా , కమలం మీద లక్ష్మి దేవి 

నిలబడ గలిగింది 

ఆకుమీద శ్రీ కృష్ణుడు వటపత్రశాయి కాగలిగాడు 

పాల సముద్రం పై నారాయణుడు , లక్ష్మీ దేవి ఆది శేషులతో  సహా

తేలియాడగలిగాడు  

Sunday, March 20, 2022

తులాభారం

 తులాభారం 

జీవితంలో విజయం సాధించాలని అనుకున్నా 

ఏం చేయాలని ప్రశ్నించుకున్నా 

సత్యభామలా జవాబుల జాబితా యిలా రాస్తూ వున్నా 

డిగ్రీలు పీహేచ్డీలు పొందు 

కరాటే కత్తి  సాములూ కుస్తీ పట్లు నే ర్చుకో 

సకల పుస్తకాలూ , నవలలూ దిన వార మాస  పత్రికలు 

నాటకాలు సినిమాలు రేడియో టీవీ ప్రోగ్రాములు చదువు విను చూడు 

యాక్టింగ్, మ్యూజిక్ మ్యాజిక్ డాన్సింగ్ పబ్లిక్ స్పీకింగ్ అభ్యసించు 

స్విమ్మింగ్ కారు   డ్రైవింగ్ లో నైపుణ్యం సాధించు 

హరికథలు బుర్ర కథలు స్వాములు ఇచ్చే ఉపన్యాసములు 

రాజకీయ నాయకుల సందేశాలు శ్రద్ధగా ఆలకించు 

మొక్కలు నాటు రోడ్డులు ఊడ్చు

జాబితా పూర్తి కావడం లేదు 

జీవితం లో ఇవన్నీ  ఎలా  నేర్చుకోవడం ఎపుడు పోరాడడం 

విజయం కాదు పరాజయం ఖాయం అనుకుంటూ వున్నా ........ .. ఆ తరుణం లో 

కృష్ణుణ్ణి గెలిచినా రుక్మిణిలా ధ్యాన శిక్షకులు 

భావాతీత ధ్యాన తులసిదళం నాకు ప్రసాదించారు  

''సత్య అనుసంధానం చేసుకో

నిత్య విజయాలు అందుకో''' అంటూ 

ధ్యానం చేసింతర్వాత తెలిసింది ఓ మరచిన చిన్న మాట 

''సత్యమేవ జయతే''  అనే రతనాల మూట 


Friday, March 18, 2022

పోనేల కాశీ పోనేల మధురా

పోనేల కాశీ  పోనేల మధురా 

నా అంతరంగం
సకల శ్రీరంగం

లక్ష్మీ నివాసం 

శారదా పీఠం 

సుగుణాలవాలం 

బహు పుణ్య స్థలం 

భావాతీతం ఐక్య క్షేత్రం 

ధ్గంగ తీర్థం

సత్సంగ  అర్థం

వైకుంఠ ధామం 

కైలాస శిఖరం 

జ్ఞాన దీపం 

విజ్ఞాన బాండాగారం 

బ్రహ్మలోకం 

పరంధామం   

గురుదేవుల కృపతో 

అనునిత్యం 

దర్శన సాధ్యం 

అవశ్యం ఆరాధ్యం 

 


చేయాలి నా ప్రతి స్పందన అందరికి శుభం

 చేయాలి నా ప్రతి స్పందన అందరికి శుభం 

తేవాలి నా  ప్రతి కార్యం అందరికీ లాభం 

సైన్సు తన చాదస్తం వదిలితే

 సైన్సు తన చాదస్తం వదిలితే అది ఆర్టు అవుతుంది 

ఆర్టు తన మత్తు  వదిలితే అది సైన్సు అవుతుంది 

Thursday, March 17, 2022

తారకం తారకం తారకం

 తారకం తారకం తారకం 

భావాతీత ధ్యానం 

గురుదేవుల వరం 

కృష్ణుడు అర్జునుడికిచ్చ్చిన ఉపదేశం 

దక్షిణామూర్తి శిష్యులకిచ్చిన జ్ఞాన నిశ్శబ్దం 

సృష్టి లోని క్లిష్ట సందేహాలకు స్పష్ట సమాధానం 

అత్యాధునిక శాస్త్రాలకు చేతన యిస్తూన్న సహస్రావధానం 

సకల దేవతలు చేస్తున్న తపస్సాధనం 

ఇది సరళం సహజం సులభం 

తారకం తారకం తారకం 

 

సృష్టి బీజం సృజన

 

సృష్టి బీజం సృజన 

సృజన సాధించు 

సృష్టి గావించు 

నీకు కావలసిన 

నీకిష్టమైన విశ్వాన్ని 

సృష్టించుకో 

ఎందుకీపరుగు ?

ఎందుకీపరుగు ?

ఎందుకీపందెం ?

నేను ఎల్లవేళలా 

విశ్వం అంతటా ఉండాలనే 

నిశ్చింతగా  నిలవాలనే 

Tuesday, February 22, 2022

ఇజం కాదు మనకు కావలసింది ఇజం లోని నిజం కావాలి

ఇజం కాదు మనకు కావలసింది  

ఇజం  లోని నిజం కావాలి 

ఇజం పోవచ్చు రావచ్చు కొత్తగా 

నిజం ను నాలుగు గోడల్లోపల ఉంచి 

ధూప దీపాల సెగలలో జిగేళ్లలో 

ఉక్కిరి బిక్కిరి చేసి ప్రిసర్వు చేయాలనీ 

ఆవగాయ పచ్చడిగా వాడుకోవాలని 

ఇజం యొక్క ఆశ దురాశ 

కానీ నిజం దానిని నిరాశ చేస్తుంది 

నిజం ఆవకాయ పచ్చడిలా కాదు ప్రిసర్వు చేయాల్సింది

దానిని ప్రేసర్వు చేయలేము 

అది చెడి పోదు 

దానిని నీవు వాడుకోనూలేవు 

అది ఒక కమోడిటీ  కాదు 

దానిని ఒక పువ్వులా 

చెట్టుమీది పువ్వులా 

తాజాగా  సమృద్ధిగా ఎదుగుతున్న చెట్టుమీది పువ్వులా 

పెంచుకో 

దాని అందాలు 

అది అమాయకంగా అందించే అందాలు 

అనుభవించు ఆనందించు , అంతే 

నిత్య కల్యాణాలు పచ్చ తోరణాలు,చెట్లు

 చెట్లు నిత్య కల్యాణాలు పచ్చ తోరణాలు 

ఎందుకంటే వీటిలో దైవత్వముయొక్క పచ్చదనం తాజాతానం సమృద్ధిగా ఉంటుంది 

చెట్లే కాదు జీవరాసులంతా అందులో మనిషి ఇంకా మంచి పచ్చ తోరణం 

విశ్వానికి అలంకరించిన ఆభరణం 

మనిషినుంచి వెలువడే చేతనయొక్క ప్రభలు , కాంతులు వన్నెలు చిన్నెలు ఎన్నో ఎంత విలువైనవో 

అతని పలుకు బంగారం అతని మాట ఓ పూబాట 

అక్షరం ఒక లక్ష 

మనిషి ఉనికి విశ్వానికి ఒక రత్న దీపం 

అలాంటప్పుడు జనాభాను అరికట్టాలా 

కాదు పెంచాలి 

అందరూ జీవించే మార్గాలు  అన్వేషించాలి 

అందరూ అత్యున్నతులుగా ఎదిగే విద్యలు నేర్వాలి 

ఇప్పటి జనాభా కాదు ఇంకా నూరింతలు ప్రకృతి మాత పెంచగలదు 

అయితే ప్రకృతి మాత ప్రేమ కిరణం మనకు ప్రసరించుకోవాలి 

ఆ విద్య నేర్వాలి  

Monday, January 31, 2022

నేనొక వృక్షాన్ని

నేనొక  వృక్షాన్ని 

ఎదుగు తూన్న కల్పవృక్షాన్ని 

పొంగి ఫొరలుతూన్న మకరంద బాండాన్ని 

మధురోహను 

మధురిమను 

అందాన్ని ఆనందాన్ని 

కవితను 

కావ్యాన్ని 

కవిని 

జ్ఞానాన్ని 

శాస్త్రాన్ని 

వేదాన్ని  

లలిత కళలు

 లలిత కళలు నేర్చుకోవాలని ఉందా ?

అయితే 

లాలిత్యము పెంచుకో నీలో ముందు 

ఓ బాటసారీ

 ఓ బాటసారీ 

ఆగినావ విసిగి వేసారి ?

తీసుకో విశ్రాంతి ఓ సారి 

సాగిపో మరలా సరాసరి 

అహింస

అహింస 

బుద్దుడు యితరులను హింసించవద్దన్నాడు 

నేను నిను నీవు  హింసించుకోవద్దు అంటాను 

Sunday, January 30, 2022

ఆటల పోటీ

ఆటల పోటీ

 అంతర్ దర్శన్ టీవీ లో 

వ్యక్త అవ్యక్తాల మధ్య ఆటల  పోటీ 

దేశకాల పరదాకు ఇరువైపులా వీరిద్దరి భలే సరదాలు 

జరుగుతూనే ఉంది 

నిత్యం డ్రా అవుతూ వుంది 

ఎందుకంటే 

అవ్యక్తం అంటోంది నేను హద్దుల్లేని అనంతాన్ని అని  

వ్యక్తం అంటోంది నేను హద్దులు కలిగిన  అనంతాన్నిఅని

అవ్యక్తం అంటోంది నేను ఏ పరిమాణం లేనిదాన్ని అని

వ్యక్తం అంటోంది నువ్వు ఉండడానికి నేనే నీకు 

అన్ని పరిమాణాలు ఉన్న ఇండ్లు కట్టించాను 

నీకు అద్దెకిచ్చాను అని 

అవ్యక్తం అనుకుంది వ్యక్తాన్ని కాల్చి వడబోసి

నిఖార్సయిన అవ్యక్తం గా మారుద్దాము అని 

తక్షణం 

మంటలు తగిలించాడు మార్తాన్డుడు 

ఆ మంటల సెగలు తగిలి సృష్టి పరిణితి అవుతూ ఉంది 

శుద్ద్ద  చైతన్యం వైపు పరుగెడుతూ వుంది 

నారాయణుని చేరి నవ్యమవుతూ ఉంది 

సమాధానం తెలిసి అవ్యక్తం అవుతూ వుంది  

ఏమీ తెలియక ఎంతో గడ్డి తిన్నాను

ఏమీ తెలియక ఎంతో గడ్డి తిన్నాను 

కుడితి నీళ్ళు తాగాను 

సైన్సు టెక్నాలజీ నేర్చాను 

చేతనా స్రవంతిలో అంతా పారబోషాను  

అంతా ఎంతో విలువ సంపాదించుకొంది 

పాలలా అమృతంలా 

వెలికి వస్తూ వుంది 

 

ఏమేమో చేద్దామని దేవుడి దగ్గిర కెళ్ళాను

ఏమేమో చేద్దామని దేవుడి దగ్గిర కెళ్ళాను 

ఏమీ చేయక్కరలేని దేవుడినయ్యాను 


చేతన నిత్య యౌవ్వనా

చేతన నిత్య యౌవ్వనా   

అందం

 అందం 

మొగ్గ అందం 

పూవు అందం 

కాయ అందం 

పండు అందం

ఆకు అందం 

రేకు అందం 

కొమ్మ అందం 

రెమ్మ అందం 

చిగురాకు అందం 

ఎండిపోయిన ఆకు అందం 

రాలుతున్న బెరడు అందం 

చెట్టు అందం 

పిట్టా అందం 

గుట్ట అందం 

పుట్ట  అందం 

పుట్ట లోని పాము అందం 

చీమ అందం 

దోమ అందం 

నింగి పైన మామ అందం 

పూర్ణమదః పూర్ణ మిదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే 

నిశ్శబ్ద భాష

 నిశ్శబ్ద భాష 

పురుష దివ్య శ్రోత 

వింటుంది నిశ్శబ్ద భాష

Tuesday, January 25, 2022

గురువు లేని విద్య గుడ్డి విద్య

 గురువు లేని విద్య గుడ్డి  విద్య 

దివ్యకళ

 దివ్యకళ 

పురుష దివ్య దృష్టి 

అవ్యక్త కళా సృష్టి 


లోదారి

 లోదారి 

సులువైన రహదారి 

స్వర్గానికి సింహద్వారి 

Saturday, January 22, 2022

అక్షరం నేర్చుకో

 అక్షరం నేర్చుకో

లక్ష్యం సాధించుకో
అవకాశాలు సృష్టించుకో
అవధులు దాటి సాగి పో
జ్యోతితో జీవనం వెలిగించు
నీతి తో ఆనందం ఆరగించు
akshar seekhlo
lakshya ko saadhlo
avakaashe srushti karlo
avadhiyo paarkar aage badho
jyothi se jeevan me ujhala laavo
neethi se aanand bhogo

Friday, January 21, 2022

ఆటల పోటీ

 అంతర్ దర్శన్ టీవీ లో 

వ్యక్త అవ్యక్తాల మధ్య ఆటల  పోటీ 

దేశకాల పరదాకు ఇరువైపులా వీరిద్దరి భలే సరదాలు 

జరుగుతూనే ఉంది 

నిత్యం డ్రా అవుతూ వుంది 

Monday, January 10, 2022

ఎచట నుండి వూరుతూన్నదీ కవిత

 ఎచట నుండి వూరుతూన్నదీ కవిత 

అనుక్షణం ఉదయించే నవ్యత 

కవిత నవ్యతా ఝరి 

సృజనతో నిండిన కుండ చేసే  చప్పుడు 

నిండుకుండ చేసే చప్పుడు 

నిండైన నిశ్శబ్దం చేసే అలజడి 

నిండుకుండ చేసే చప్పుడు

 నిండుకుండ చేసే చప్పుడు 

నిండైన నిశ్శబ్దం చేసే అలజడి 

Sunday, January 9, 2022

ఇహం పరం సాధించాలనుకుంటే

ఇహం పరం సాధించాలనుకుంటే 

కడిగిన ముత్యం లా 

సానబెట్టిన వజ్రంలా 

వెలుగుజిమ్మే రత్నంలా 

ఉండాలనుకుంటే 

తీయని కలగా  

కమ్మని రుచిగా  

వెన్నెల రేయిగా 

మారాలనుకుంటే  

పదునుపెట్టిన చాకులా

ఎదురులేని  మాటలా 

గురితప్పని బాణంలా 

కావాలనుకుంటే 

ఊహల అంచులకు 

గుండెలలోతులకు 

నీ దేవుడి చేరువకు 

చేరాలనుకుంటే 

సులువైన సాధనం 

భావాతీత ధ్యానం 


Thursday, January 6, 2022

సృష్టి బీజం సృజన

 సృష్టి బీజం సృజన 

సృజన సాధించు 

సృష్టి గావించు 

ఖగోళ వ్యాపారంలో గోళీల కేళీవినోదం

 ఖగోళ వ్యాపారంలో గోళీల కేళీవినోదం 

పరమపురుషుని వేళా కోళం 

సూర్య భువనజ్ఞానం 

భగ భగ మంటల్లో  హాయిగ నిద్రించి వుంది 

ఒక చల్లని ప్రకృతి సూత్రం 

సూర్యనారాయణ తత్వం