Sunday, March 20, 2022

తులాభారం

 తులాభారం 

జీవితంలో విజయం సాధించాలని అనుకున్నా 

ఏం చేయాలని ప్రశ్నించుకున్నా 

సత్యభామలా జవాబుల జాబితా యిలా రాస్తూ వున్నా 

డిగ్రీలు పీహేచ్డీలు పొందు 

కరాటే కత్తి  సాములూ కుస్తీ పట్లు నే ర్చుకో 

సకల పుస్తకాలూ , నవలలూ దిన వార మాస  పత్రికలు 

నాటకాలు సినిమాలు రేడియో టీవీ ప్రోగ్రాములు చదువు విను చూడు 

యాక్టింగ్, మ్యూజిక్ మ్యాజిక్ డాన్సింగ్ పబ్లిక్ స్పీకింగ్ అభ్యసించు 

స్విమ్మింగ్ కారు   డ్రైవింగ్ లో నైపుణ్యం సాధించు 

హరికథలు బుర్ర కథలు స్వాములు ఇచ్చే ఉపన్యాసములు 

రాజకీయ నాయకుల సందేశాలు శ్రద్ధగా ఆలకించు 

మొక్కలు నాటు రోడ్డులు ఊడ్చు

జాబితా పూర్తి కావడం లేదు 

జీవితం లో ఇవన్నీ  ఎలా  నేర్చుకోవడం ఎపుడు పోరాడడం 

విజయం కాదు పరాజయం ఖాయం అనుకుంటూ వున్నా ........ .. ఆ తరుణం లో 

కృష్ణుణ్ణి గెలిచినా రుక్మిణిలా ధ్యాన శిక్షకులు 

భావాతీత ధ్యాన తులసిదళం నాకు ప్రసాదించారు  

''సత్య అనుసంధానం చేసుకో

నిత్య విజయాలు అందుకో''' అంటూ 

ధ్యానం చేసింతర్వాత తెలిసింది ఓ మరచిన చిన్న మాట 

''సత్యమేవ జయతే''  అనే రతనాల మూట 


No comments:

Post a Comment