ఇజం కాదు మనకు కావలసింది
ఇజం లోని నిజం కావాలి
ఇజం పోవచ్చు రావచ్చు కొత్తగా
నిజం ను నాలుగు గోడల్లోపల ఉంచి
ధూప దీపాల సెగలలో జిగేళ్లలో
ఉక్కిరి బిక్కిరి చేసి ప్రిసర్వు చేయాలనీ
ఆవగాయ పచ్చడిగా వాడుకోవాలని
ఇజం యొక్క ఆశ దురాశ
కానీ నిజం దానిని నిరాశ చేస్తుంది
నిజం ఆవకాయ పచ్చడిలా కాదు ప్రిసర్వు చేయాల్సింది
దానిని ప్రేసర్వు చేయలేము
అది చెడి పోదు
దానిని నీవు వాడుకోనూలేవు
అది ఒక కమోడిటీ కాదు
దానిని ఒక పువ్వులా
చెట్టుమీది పువ్వులా
తాజాగా సమృద్ధిగా ఎదుగుతున్న చెట్టుమీది పువ్వులా
పెంచుకో
దాని అందాలు
అది అమాయకంగా అందించే అందాలు
అనుభవించు ఆనందించు , అంతే
No comments:
Post a Comment