చెట్లు నిత్య కల్యాణాలు పచ్చ తోరణాలు
ఎందుకంటే వీటిలో దైవత్వముయొక్క పచ్చదనం తాజాతానం సమృద్ధిగా ఉంటుంది
చెట్లే కాదు జీవరాసులంతా అందులో మనిషి ఇంకా మంచి పచ్చ తోరణం
విశ్వానికి అలంకరించిన ఆభరణం
మనిషినుంచి వెలువడే చేతనయొక్క ప్రభలు , కాంతులు వన్నెలు చిన్నెలు ఎన్నో ఎంత విలువైనవో
అతని పలుకు బంగారం అతని మాట ఓ పూబాట
అక్షరం ఒక లక్ష
మనిషి ఉనికి విశ్వానికి ఒక రత్న దీపం
అలాంటప్పుడు జనాభాను అరికట్టాలా
కాదు పెంచాలి
అందరూ జీవించే మార్గాలు అన్వేషించాలి
అందరూ అత్యున్నతులుగా ఎదిగే విద్యలు నేర్వాలి
ఇప్పటి జనాభా కాదు ఇంకా నూరింతలు ప్రకృతి మాత పెంచగలదు
అయితే ప్రకృతి మాత ప్రేమ కిరణం మనకు ప్రసరించుకోవాలి
ఆ విద్య నేర్వాలి
No comments:
Post a Comment