Sunday, January 30, 2022

ఆటల పోటీ

ఆటల పోటీ

 అంతర్ దర్శన్ టీవీ లో 

వ్యక్త అవ్యక్తాల మధ్య ఆటల  పోటీ 

దేశకాల పరదాకు ఇరువైపులా వీరిద్దరి భలే సరదాలు 

జరుగుతూనే ఉంది 

నిత్యం డ్రా అవుతూ వుంది 

ఎందుకంటే 

అవ్యక్తం అంటోంది నేను హద్దుల్లేని అనంతాన్ని అని  

వ్యక్తం అంటోంది నేను హద్దులు కలిగిన  అనంతాన్నిఅని

అవ్యక్తం అంటోంది నేను ఏ పరిమాణం లేనిదాన్ని అని

వ్యక్తం అంటోంది నువ్వు ఉండడానికి నేనే నీకు 

అన్ని పరిమాణాలు ఉన్న ఇండ్లు కట్టించాను 

నీకు అద్దెకిచ్చాను అని 

అవ్యక్తం అనుకుంది వ్యక్తాన్ని కాల్చి వడబోసి

నిఖార్సయిన అవ్యక్తం గా మారుద్దాము అని 

తక్షణం 

మంటలు తగిలించాడు మార్తాన్డుడు 

ఆ మంటల సెగలు తగిలి సృష్టి పరిణితి అవుతూ ఉంది 

శుద్ద్ద  చైతన్యం వైపు పరుగెడుతూ వుంది 

నారాయణుని చేరి నవ్యమవుతూ ఉంది 

సమాధానం తెలిసి అవ్యక్తం అవుతూ వుంది  

No comments:

Post a Comment