Sunday, November 9, 2025

 మాటల ఆట


తిమింగిలాలను మింగాలనిపిస్తుంది

రాకెట్టును నా లాకెట్టు లా వాడాలనిపిస్తుంది


అంతా శివుడిలా 

తన ఇష్టప్రకారం 


చంద్రుణ్ణి నెత్త్తి మీదా

పామును మెడచుట్టూ


రెండు కన్నులు చాలవని 

నుదుటిమీద ఇంకొకటి


ఊరికే కూర్చోడం, తపస్సుచేస్తూ

విసిగి గంతులేయడం డాన్సు ఆడుతూ

No comments:

Post a Comment