Wednesday, July 27, 2016

కవి కావాలనుకున్నాను

కవి కావాలనుకున్నాను
కవితనయ్యాను 

సృష్టించాలి అనుకున్నాను 
సృష్టినయ్యాను 

విద్యావంతుడిని కావాలనుకున్నాను
విద్యనయ్యాను 

ధనం సంపాదించాలి అనుకున్నాను
ధనం అయ్యాను 

దేవుడిని చూడాలనుకున్నాను 
దేవుడినయ్యాను 

Sunday, July 24, 2016

ఆకులో ఆకునై

with nature ఆకులో ఆకునై

ఆకులో ఆకునై పూవులో పూవునై

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటన యాగిపోనా?

గల గలని వీచు చిరుగాలిలో కెరటమై
జల జలని పారు సెలపాటలో తేటనై
యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటన యాగిపోనా?
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటన యాగిపోనా?
తరు లెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటన యాగిపోనా?
ఆకలా దాహమా చింతలా వంతలా
కరణి వెర్రినై యేకతమా తిరుగాడ
యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటన యాగిపోనా 

మేఘసందేశం చిత్రం

i liked this poem of devula palli krishna shasthri
individuality is melting into universality
flow of heart free, innocent,
it takes me to another world
i want to read this again and again and flow along with the poet like a stream, fly like a bird , or stay like a tree, fully happy and in the company of the nature around


my translation

Why not i be 
a leaf among the leaves?
a branch among the branches?
or a tender twig?
and get lost hidden in this forest?
somehow,
why not i stop here and be forever

Why not i be
 a ripple in the gently singing little breeze?
a  flow as just water in the gurgling stream?
and get lost hidden in this forest?
somehow,
why not i stop here and be forever?

Why not i be
hiding behind the screen of sprouting tiny gem like leaves
a blushing blossoming little girl
and get lost hidden in this forest?
somehow,
why not i stop here and be forever?

Why not i be
climbing up the trees, and the blue mountain  beyond, slowly trampling
on the worm clusters, or be the sheen of the bluish cloud ?
and get lost hidden in this forest?
somehow,
why not i stop here and be here?

Why not i be
Unmindful of hunger or thirst, worries or woes
a lunatic wandering alone like this?

and get lost hidden in this forest?
somehow,
why not i stop here and be forever? 

ఏమరుపాటు లేని దైవత్వం

unrelenting

ఏమరుపాటు లేని దైవత్వం వెలుగుతుంటే

మాయా మోహిని అమృతాన్ని అందిస్తుంది

when unrelenting glows divinity,
maya mohini offers amrit

ప్రభూ ప్రకృతి శోభను నీవు


prabhu ప్రభూ
ప్రకృతి శోభను నీవు తిలకించడానికి
నాకు కనులు ఇచ్చావు
నీ అవసరాలు తీర్చు కోడానికి
నాకు అవయవాలు ఇచ్చావు
నీ కోసమే
నీవే నేనయి వున్నావు

prabhu
for you to see the beauty of nature
you gave the eyes to me
for you to fulfill your needs
you gave the limbs to me
for your sake only

very same you is existing as me

ప్రతిభ

merit ప్రతిభ
''నవ నవోన్మేశ శాలిని యగు బుద్దియే ప్రతిభ'' [ --this is a statement from my sslc telugu text book---is there in my memory ever--]

merit is --the ability of the intellect to generate ever new ideas
now i knew that it is a vedik truth
it is the nature of nature to update itself
''navonavobhavathi''
''rebirth'' of the old with freshly revised and released, not once a while but moment to moment
that is the charm of life, ever new

తివిరి ఇసుమున

'తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణ లో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు''

may be possible
to extract oil from sand
to sip water in mirage
to fetch horn of a hare
but possible not

to enlighten an idiot

లేటెస్ట్ ఫ్యాషన్

లేటెస్ట్  ఫ్యాషన్ 

సత్య యుగపు జ్ఞ్యాన సూర్యుని ప్రభలలొ 
మానవత్వం అనేది ఎప్పుడో పాతబడిన ఫ్యాషన్

క్షణం క్షణం నిశ్శబ్దంగా నీలో స్పందించే దైవత్వం 
ఇప్పుడిప్పుడే వెలువడుతున్న లేటెస్టు ఫ్యాషన్ 

latest fashion

in the sunshine of this age of enlightenment
humanism is an outdated old fashion

silently moment to moment pulsating divinity within you

is the upcoming latest fashion

ఇరుసున కందెన పెట్టక

ఇరుసున కందెన పెట్టక
పరమేశుని బండి యైనా పారదు సుమతీ''

పరమేశుని బండి మన శరీర వ్యవస్థ
ఇరుసున కందెన సిద్ది సాధన

సులువుగా పనులు సాగి పోతాయి
అలసటలు పారి పోతాయి
అరుగుదలలు తగ్గి పోతాయి
కాదది మామూలు కందెన
మకరందం లాంటి చేతన
మన బండికి పరమేశుని దీవన
మహర్షి మహేశుని చలువన

in the axle if no lubricant ,
paramesha's vehicle even, cannot run ---o sumathee
paramesha's vehicle, our body system,
in its axle, the lubricant is sidhi sadhana
works go smooth
exhaustion vanishes
wear-outs reduce
not it is an usual lubricant
honey like consciousness
for our vehicle, the blessing of paramesha

with the grace of maharishi mahesha

నేను

నేను
ఆది శంకరాచార్యుల వారి గురు పరంపరకు చెందిన
అనంత జగత్తు లోని శిష్య పరమాణువుణ్ణి
అనాది శంకరుని విస్ఫులింగ కణాన్ని
యుగపు ఆచార్యుణ్ణి
కాబోతున్న అత్యాధునిక శంకరాచార్యుణ్ణి
మానవత ్వానికి చిగురిస్తూన్న దైవత్వాన్ని

ఆది శంకరులు జగత్గురువులు
అనంత జగత్తు అతని శిష్య వర్గం
దైవత్వం మానవత్వానికి చిగురిస్తుంది
మానవత్వ పూర్తిగా ఎదిగి పుష్పిస్తే అది దైవత్వం అవుతుంది

i am
one shishya paramaanu , among the anantha shishya jagath
of the guruparampara of adi shankaracharya
anaadi shankara's visphulinga kana
aachaarya of this yuga
the most modern would be shankaracharya
the divinity sprouting in the humanity

adishankara is jagathguru
anantha jagath is his shishya varga
divinity sprouts from the humanity

divinity manifests in full growth and blossoming of humanity

ఎదిగి ఎదిగి

ఎదిగి ఎదిగి


ఎదిగి ఎదిగి పెద్ద వాడిని కాలేదు
పసి కందు నయ్యాను
వటపత్ర శాయి నయ్యాను

i grew and grew, not into elder
i became a child tender
i became vata patra shayi


spiritual growth is true growth
all the rest is mere froth

as spititual growth happens,one is born again,
as a child, with a slate clean, with a mind a mirror

navo navo bhavathi is the nature of creative intelligence

renders one grow in the ability of finding new ways, new perceptions, more play,

burden of experiences off-loaded instantly as if a line drawn on water, gets deleted, automatically

నా ప్రతి స్పందన

నా ప్రతి స్పందన 
విశ్వమునకు అభినందన
విశ్వము నేనే కదా 

every impulse of mine
is a compliment to the universe
universe is only me

బంధాలు తెంచుకో

బంధాలు తెంచుకో 

అనుబంధాలు పెంచుకో 

అంతకన్నా 

బంధాలను ప్రేమ ప్రబంధాలు గా మార్చుకో 

స్త్రింగ్స్ ను వింగ్స్ గా వాడుకో 

విహంగం లా విహరించు 

హొరైజన్ ను విస్తరించు

 

Break the bondages

Nurture Sweet relations 

Better still

 

Transform the bondages into romantic epics

Use strings as wings

 

Roam free like a bird

Expand the horizon 

Saturday, July 23, 2016

winter shiva శివుడు శిశిరం

winter shiva శివుడు శిశిరం
శివుడు శిశిరం అయి ఆకుల్ని రాలుస్తున్నాడు
బ్రహ్మ వసంతoగా గా వచ్చి క్రొత్త చిగురు రప్పిస్తున్నాడు
చైతన్న్య రూపి నీ అవినశాతత్వం
"
సంభవామి యుగే యుగే " అవుతూ ఉన్నది

shiva becomes winter, drops leaves
brahma as spring comes and creates new leaves
o consciousness, your invincibility manifests
again and again from time to time

yuvatha యువత

yuvatha యువత 

యువతా వో నవతా
పొంగుతున్న భావుకతా

కొంగ్రొత్త నీ పంథా
లేదు నీకు వింత
ఎపుడూ నీవే వో వింత
సాధించ లేవు ఎంత

నీ కోసమే వుంది విశ్వమంతా
నిను నీవు మలచుకో రవ్వంత
గెలుచుకోగాలవు అంతా
yuvathaa o navathaa
uchal rahe bhaavukatha

hai nayaa nayaa thumaara raasthaa
nahee hai thumko koi cheez azeeb

hameshaa thumhee ho ek azeeb
nahee pavoge kyon kithnaa kyaa

thumaare liye hee hai saaree duniyaa
sambhaalo apaneko thodihee bas

saara samasth ko jeethlo sakege ab

rishi sees
the youth is one who is in contact with the pure awareness which is ever fresh ever new , chethana , nithya noothana, sadaa yavvana, nithya vasantha, navo navo bhavathi, no god is old,
 hence gods' pictures are always of their ever prime age, 
none has seen them aging

all the laws of nature, the sakala devi devathaas, are eternal,
never get old nor obsolete, 
consciousness has nothing to do with bio age

it's ageless, timeless, ever a youth in newness  

ఏమిటీ ఈ అలజడి నిశ్శబ్దంలో

ఏమిటీ అలజడి నిశ్శబ్దంలో 
ఎలా సాధ్యం నిశ్శబ్దం అలజడిలో
ఎందుకీ అన్వేషణ సాఫల్యంలో 
ఎలా సాద్యం సాఫల్యం అన్వేషణలో
విశ్వాన్నే మారుద్దామని క్షణం 
అసలేమీ చేయక్కర్లేదని మరు క్షణం
సాధన పూర్తి అయిందా 
పూర్తిగా మరి మొదలయిందా
అడుగడుగునా అనుమానాలు 
అడగకుండా సమాధానాలు
what is this silence in the noise
how is noise possible in the silence
why this search in the fulfillment
how is fulfillment possible in the search
at one moment, wanting to transform the universe
next moment, needing not to do a thing
is sadhana completed in totality 
has it in totality started again

questions at each step
answers unasked