Thursday, January 2, 2014

మేలుకోలుపు

మేలుకోలుపు

నేను నిదుర మేల్కొన్నాను
అందరినీ మేల్కొలుపుతున్నాను

ప్రభాత రాగాలను పాడు చున్నాను
శుభ ముహూర్తాలతో కరచాలనం చేసి

కార్య రంగం వైపు ఉరకలు వేస్తున్నాను
విజయానికి ప్రాణమైన సత్తును

మనసు నిండా నరాలనిండా
వొంటినిండా నింపుకొని

ఘనవిజయానికి పునాదులు వేస్తున్నాను
విశ్వ విజయానికి నినాదాలు చేస్తున్నాను

విజయీభవ
దిగ్విజయీభవ

అవుతూవున్నది విజయం నాదే
కాబోతూంది స్వంతం ఈ విశ్వం నాకే

పొద్దు వాలకముందే విజయున్ని అవుతున్నాను
ధనంజయున్ని అవుతున్నాను

జయమాలలతో అలంకరించుకొని
విజయఫలాలు సంచీలనిండా నింపుకొని

చీకటి కాకమునుపే ఇలు చేరుకుంటున్నాను
తలిదండ్రుల ఆశీస్సులను అందుకుంతున్నాను

శ్రీరస్తు శుభమస్తు
సకలసిద్ది ప్రాప్తిరస్తు



No comments:

Post a Comment