Wednesday, January 8, 2014

కవితంటే

కవితంటే

మాటల్ని ముద్దుపెట్టుకోవడం
ముద్దుమాటలు చెప్పడం, ముద్దుగా చెప్పడం

మారాము చేసే మాటల్ని
గారాబు చేసి పెంచాడంపెంచడం

మనసులోనున్న ప్రేమనీ సౌన్నిత్యాని
మాటలకు అందించి , వాటి విలువ పెంచడం

మాటల్ని ఆటాడనివ్వడం  పాడుకోనివ్వడం
లాలించి పాలించి బుజ్జగించడం

అవి కథలు చెబుతుంటే వూకోట్టడం
నిదుర పోతూంటే జోకోట్టడం

మాటల్ని పుష్పింప జేయడం
మధుర ఫలాలను ఇచ్చేట్టు చేయడం

మధుర కావ్యాలుగా మార్చడం
అక్షరాలుగా అమృతాలుగా తీర్చి దిద్దడం

సత్యాలను పలికిమ్పజేయడం
నిత్యంగా నిలిచేట్టు చేయడం

కొంగ్రొత్త రుచుల్ని చిన్దిమ్పజేయడం
మాటల్ని వేదాలుగా పాడించడం 

No comments:

Post a Comment