Saturday, November 29, 2014

ప్రభూ నా పిలుపు నిను చేరక ముందే

, నీ పలుకు

ప్రభూ
నా పిలుపు నిను చేరక ముందే
నీ పలుకు నాకందే
నా పిలుపే నీ పలుకు

prabhu
before my call reached you
thy response reached me
my call is it self, thy response

you write to my soul
i read you in my soul

it's all soul to soul
thy soul is my soul

it's a song i sing ,solo 
i alone hear , lo!

Friday, November 28, 2014

పురుష ప్రతిభ

పురుష ప్రతిభ 

విశ్వం , ఇది ఒక దృశ్య కావ్యం

వ్యక్తావ్యక్తల సంమిశ్రనం 

 

కల్పనా వాస్తవికలతో సమ్మోహనం

ఇది నవరస భరితం , సకల కళా శోభితం

 

ప్రతిసన్నివేశం నవ నవోన్మేశం  

క్షణం క్షణం జీవితం ఉత్కన్ట్ట  జనితం 

 

నేపథ్యం అరణ్య నదీ నద పర్వత సాగరమయం

ఆకాశ సూర్య చంద్ర తారా మండలాలతో అలంకృతం

 

వైవిధ్య  వైరుధ్య  విపరీతాలతో రీతి సవ్యతల సఖ్యం 

ఇదొక జీవ నిర్జీవ ప్రతిమా నాటకం పురుష ప్రతిభా పాటవం

 

ఇందులో నీవొక ప్రేక్షకుడవే  కాదు ఒక పాత్ర ధారివి కూడా

దాని సూత్ర ధారివి కూడా  

 

నీ పాత్ర అతనిదొక చిరు అవతారం 

జగన్నాటక సూత్ర దారివిగా ఎదగడానికి  నీకిచ్చిన సదవకాశం

 

సాధించు రాణించు జయించు జగమేలు 

మెలమెల్లగా చల్లగా తీయగా హాయిగా 

the glory of supreme

universe is a visual poetic treat
a mix of visibles and invisibles, neat

full with 9 moods, bedecked with all arts
it is bewitching with fiction and facts

every scene ever a flow of novelty
moment to moment , suspense, a running commentary 

back drop rich with jungles, rivers, rivulets, mountains, oceans
well beautified with sky sun moon stars galaxies

variety, contradictions ,odds in friendship with harmony and order
this is a drama with living and nonliving dolls, the glory of supreme designer

in this you are not only a spectator but also an actor, 
and more its director

this your role is his a small incarnation
to enable you to grow into the stature of director of this drama of universe

accomplish, shine, win, and rule the universe
gradually, coolly, sweetly, blissfully


Monday, August 25, 2014

బాధ్యత

బాధ్యత

బహు సుందర మగు  వాణిని లిఖించుట ఒక గురుతర బాధ్యత.
అందమైన అచ్చ తెలుగులో
స్వచ్చమైన గ్రాంథికములో
వ్యాకరణాది దోష రహితముగా
ఛందో బద్ధముగా
సందర్భోచిత అలంకార యుక్తమైన
భావ ప్రకటన ఒక తపస్సు
ఒక అర్పణ !
ఈ ప్రయత్నమునందే లక్ష్యము ప్రాప్తించును

Sunday, August 24, 2014

ఒక వీణ నను చూసి నవ్వింది..

ఒక వీణ నను చూసి నవ్వింది

తనను గెలుచుకొమ్మంది


వెల ఇచ్చి కొని కాదు

పగుల గొట్టి కాదు
 

తన వ్యక్తిత్వం పూర్తిగా ప్రస్ఫుటించేలా

వాయించ మంది

 

అందుకై ముందు, నామీద నాకు ఆధిక్యం 

సంపాదించ మంది

 

veena smiles


a veena looking at me, smiles, tells me
''come on , win me , overpower me, ''

not by purchasing , paying a price
not by breaking into many a piece,

but by playing, bringing out in totality
its personality

for this it asks me to achieve
mastery over my self first


Wednesday, January 8, 2014

కవితంటే

కవితంటే

మాటల్ని ముద్దుపెట్టుకోవడం
ముద్దుమాటలు చెప్పడం, ముద్దుగా చెప్పడం

మారాము చేసే మాటల్ని
గారాబు చేసి పెంచాడంపెంచడం

మనసులోనున్న ప్రేమనీ సౌన్నిత్యాని
మాటలకు అందించి , వాటి విలువ పెంచడం

మాటల్ని ఆటాడనివ్వడం  పాడుకోనివ్వడం
లాలించి పాలించి బుజ్జగించడం

అవి కథలు చెబుతుంటే వూకోట్టడం
నిదుర పోతూంటే జోకోట్టడం

మాటల్ని పుష్పింప జేయడం
మధుర ఫలాలను ఇచ్చేట్టు చేయడం

మధుర కావ్యాలుగా మార్చడం
అక్షరాలుగా అమృతాలుగా తీర్చి దిద్దడం

సత్యాలను పలికిమ్పజేయడం
నిత్యంగా నిలిచేట్టు చేయడం

కొంగ్రొత్త రుచుల్ని చిన్దిమ్పజేయడం
మాటల్ని వేదాలుగా పాడించడం 

సాయుధ విప్లవం

సాయుధ విప్లవం

విప్లవ యోధుల్లారా
మీ ఆయుధాలు పదునుగా ఉన్నాయా
పోరాడడానికి మీ శరీరాలు తయారుగా ఉన్నాయా
మీ శరీరం లో వేడి రక్తం వురకలేస్తోన్దా
బండరాల్లవంటి కండరాళ్ళు మీకున్నాయా

విప్లవం విజయం పొందేందుకు
విజయవంతంగా నడిపించేందుకు
వ్యూహాలు పన్నడం మీకు చేతనవుతుందా
బుధి కుశలతా ,మానసిక స్థైర్యం , ఆత్మ విశ్వాసం  మీకున్నాయా

లేక
చచ్చిన పాముల్లా , తుమ్మితే  ఊడే ముక్కుల్లా
గానుగ ఎద్దుల్లా , కూపస్థ మండూకాల్లా వున్నారా మీరు
వట్టి ఆవేశాలు , ఉత్తుత్తి వేషాలు పనికి రావోయ్
కావాలి నిజమైన నికార్సైన ఉద్యమం
అదే సత్య సాధనం , నిజమైన సాధనం




నేనెవరు

నేనెవరు 

నేనొక
స్పందించే బీజాన్ని 
మొలకెత్తే అంకురాన్ని 
ఎదిగే మొక్కను 
చిగురించే కొమ్మను 
పూచే రెమ్మను 
విచ్చే పువ్వును 
ఊరే తేనియను 
చిందే తీపిని 
మురిపించే హాయిని 


translation follows  

Monday, January 6, 2014

my scribbles నా రాతలు..

   my scribbles నా రాతలు 

నాన్ ఋషి కురుతే కావ్యం
ఋషి కాని వాడు కవి కాలేడు

మనసు నా కలము
చేతన నా సిరా
ఆకాశము నా కాగితము

నా రాతలు నా ఇష్టాలు
నా ఇస్ట దేవతలు

''naanrishi kuruthe kavyam''
one who is not seer can't pen a poem 

mind is my pen
consciousness is the ink
sky is my paper

my scribbles are my hearts drizzle
my invisible dearest gods coming out, visible

..................................................... ...........................


i take liberty to add dialogs

..................................................... ..............................

s3 replies 


But I was wondering who starts the the the process of writing a poem and why? Why does mind the pen feel like writing? How does the process start, it has to get the ink from self of course to write . But the ink giver, does it generate desire to write also apart from giving ink? Is desire also a manifestation?

i reply

s3g, the silent unmamifest, the pure cosciousness, the field of infinite potential enery, potential dynamism , is ever ready and , jumps into action as the manfest dynamism, the kinetic energy, --at the earliest opportunity thru all available channels of expression like a powerful athlet just ready to jump, with great energy and intelligence----
it is like a gas in a cylinder just ready to leak out thru any small appertures--of course it does not burst but has the energy stored in it like a compressed spring

all the live beings are the channels thru which it manifests.
having the infinite sath energy and chith intelligece, it expresses in perfect order, beauty, truthfully following the defined laws of nature which it self has designed

manifestation starts on its own will and its own nature to come out[gas analogy]--thru subtlest impulse as a desire, a subtlest thought imperceptible to a normal man--ignorant---, grows as manifest thought --comes to be perceivable level and drives the mind to activate the nervous system to express in sppeech action growth evolution

silence does not mean remaining dumb, it is the state of settled state of mind , the pure consciousness, a state of no thought, no action --transcendental consciousness, momentary in the beginning and gets permeated in the thinking mind and all most virile activities in the mature state of sadhana, one is experiencing the inner infinite silent in all activities and all states sleep dream wake . 


kdg replies---

I wonder ,
 is it the veda richa technology ?


i reply

Oh kdg g

---surmise is nice, true

more a rishi technology , you may call
our country has specialized in this

'' invisible dearest gods coming out, visible ''-rigveda----

''richo akshare parame vyoman yasmin deva adi vishve nisheduhu....''--
knowledge is structured in consciousness, beyond the subtlest mind, in the transcendent, in which reside the the gods--the laws of nature responsible for governing the universe----

rishi cognizes these gods,
the chunks of knowledge,
the laws of nature, the universal truths,
and owns them in his nature and awareness
and makes his life to flow in accordance with laws of nature

spotaneously, effortless--

all glory to our holy traditions who have preserved this science[knowledge] and technology[experiencing practically]

in purity and passed on to us thru guruparampara
i want to say jaigurudev punah punah


Silence does not mean remaining dumb,

it is the state of settled state of mind , the pure consciousness, a state of no thought, no action --transcendental consciousness,

momentary in the beginning 

and gets permeated in the thinking mind and all most virile activities in the mature state of sadhana, 

one is experiencing the inner infinite silent in all activities and all states sleep dream wake .

sadhana, సాధన

sadhana, సాధన. 
నేడు కొంత
రేపు ఇంక కొంత
రోజూ కొంత కొంత
త్వరలోనే అంతా 

to day a little
tomorrow a bit more
daily bit by bit
soon, total all

Sunday, January 5, 2014

అ ఆ లు నేర్చుకుందాం

అ ఆ లు

అ ఆ లు నేర్చుకుందాం 
ఆశయాలు నేరవేర్చుకుందాం

ఇ ఈ ల తో ఆడుకుందాం 
ఈ ఇలను కలలతో నింపుకుందాం

ఉ ఊ ల ఉయ్యాలలో
ఊగుదాం
ఋ రూ ల రుచులు
చవి చూదాం

లులూలను గురించి 
తెలుసుకుందాం 
 ఎ ఏ  ఐ  ఓ ఓ  ఔ లను 
ఔరా అనిపించుదాం

 అం అః  లతో 
ఆహా ఓహో అని ఆశ్చర్యపరుద్దాం

let's learn abcd
let's fulfill aspirations
let's learn efgh
let's fill this earth with dreams
let's learn ijkl
let's swing in the cradles
let's learn mnop
let's enjoy of taste of these
let's learn qrst
let's learn what they are
let's learn uvw
let's win marvels
let's learn xyz
let's make all flabbergast

Thursday, January 2, 2014

మేలుకోలుపు

మేలుకోలుపు

నేను నిదుర మేల్కొన్నాను
అందరినీ మేల్కొలుపుతున్నాను

ప్రభాత రాగాలను పాడు చున్నాను
శుభ ముహూర్తాలతో కరచాలనం చేసి

కార్య రంగం వైపు ఉరకలు వేస్తున్నాను
విజయానికి ప్రాణమైన సత్తును

మనసు నిండా నరాలనిండా
వొంటినిండా నింపుకొని

ఘనవిజయానికి పునాదులు వేస్తున్నాను
విశ్వ విజయానికి నినాదాలు చేస్తున్నాను

విజయీభవ
దిగ్విజయీభవ

అవుతూవున్నది విజయం నాదే
కాబోతూంది స్వంతం ఈ విశ్వం నాకే

పొద్దు వాలకముందే విజయున్ని అవుతున్నాను
ధనంజయున్ని అవుతున్నాను

జయమాలలతో అలంకరించుకొని
విజయఫలాలు సంచీలనిండా నింపుకొని

చీకటి కాకమునుపే ఇలు చేరుకుంటున్నాను
తలిదండ్రుల ఆశీస్సులను అందుకుంతున్నాను

శ్రీరస్తు శుభమస్తు
సకలసిద్ది ప్రాప్తిరస్తు



 నైవేద్యం

ఆబాలగోపాలం బాల గోపాలులుగా
ఆనందించే అవకాశం కలిగించేందుకు
దీక్ష వహించిన, నాకు దీక్షనిచ్చిన
బాలగోపాల స్వరూపుడైన
 శ్రీ బాలగోపాల్  గారికి

భక్తి తో ,
అంతకన్నా, ప్రేమతో
చిథ్విలాసపు చిరు నవ్వుల
మల్లె పువ్వులతో
సమర్పించుకుంటున్నాను నైవేద్యంగా

నా అక్షర క్షేత్రములో
మొలకెత్తిన రుచులు
ఈ ఋచాలు