శిష్య బృందం కాని ఒక తరగతి లో విద్యార్థులు కాని వీరందరూ మొలకెత్తుతున్న నారు మళ్ళు తదుపరి, ఒక్కొక్క నారు విడిగా ఎదగాలి మహావృక్షం కావాలి కల్ప వృక్షం అవ్వాలి
రాగాలలో వేద శాస్త్రాలు ధ్వనించాలి దేవ గంధర్వుల గాన మాధుర్యం అందాలి
మాట ఓ ఆటలా ఉండాలి దాని నుండి పాట వినిపించాలి సెలయేటి నీటిలా సునాయాసంగా సాగి పోవాలి ఆ నీటి తేట లో బరువు గుండెలు సేద తీర్చుకోవాలి మనసు లోని గాయాలు మాయమవ్వాలి నీ గుండెలోని తీపి తేనియ ను వినువారి నాలిక్కి అందించాలి తీపి తింటున్నానా లేక వింటున్నానా అనుకునేట్లు అనుకోనట్లూ చల్లగా మెత్తగా పలికించు అందమైన పరిమళాలు కురిపించు
పండుగలూ పబ్బాలూ నోములూ వ్రతాలూ ఇప్పుడు ఇసుక మేట వేసిన ఆనకట్టలు
ఒకప్పుడు వీటిద్వారా చేతన విద్యుథ్చక్తిలా ప్రవహించేది జీవనం ఆనందమయం గావించేది ఇప్పుడూ ఇవన్నీ ఉన్నాయి , ఫిజికల్ గా మాత్రమే చేతనా విద్యుత్తు ప్రవహించడం లేదు ఇసుక మేటలు తీసి వేయ్ విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పాటు చేయ్