నేల విడిచిన సాము వద్దు
asdf jkl; టైపులో రెఫరెన్సు
షడ్జము సరిగమల్లో
ఆధార స్వరం
సివిల్ ఇంజినీరింగ్ లో బెంచ్ మార్క్ సముద్ర మట్టం
గోల్ కీపర్ యథా స్థానం లోకి రావాలి
తబలా కు లహరా రిఫరెన్స్
పిల్లకు తల్లి
పక్షికి గూడు
బెంచ్ మార్కులు రెఫెరెన్సులు లేకపోతే
ఆయా రంగాలలో కన్ఫ్యూజన్ ఖాయం
మరి
జీవితానికే రెఫెరెన్సు లేకపోతే ??
అన్ని రంగాలలో కన్ఫ్యూజన్ ,
మొత్తం అయోమయం
అందుకే ఇన్ని బాధలు, సమస్యలు
జీవితానికి అసలైన రెఫెరెన్సు అంతరంగం లోని పరా క్షేత్రం
దానితో అనుసంధానం
చేస్తుంది ఇహంను ఆనందమయం