Tuesday, January 27, 2015

ఎంతో చేద్దామని

ఎంతో చేద్దామని
మరెంతో సాధిద్దామని
ఇంకెంతో నేర్చుకున్నాను
సమకూర్చుకున్నాను

అంతా సాధించడానికి
ఇసుమంత కూడా చేయనవసరం లేదని తెలుసుకున్నాను
అంతా సాధిస్తూ
ఏమీ చేయని దేవుడనయ్యాను
బ్రహ్మనయ్యాను
రాతి బొమ్మనయ్యాను

శిష్య బృందం

శిష్య బృందం కాని ఒక తరగతి లో విద్యార్థులు కాని
వీరందరూ మొలకెత్తుతున్న నారు మళ్ళు
తదుపరి, ఒక్కొక్క నారు విడిగా ఎదగాలి
మహావృక్షం కావాలి
కల్ప వృక్షం అవ్వాలి 
రాగాలలో వేద శాస్త్రాలు ధ్వనించాలి
దేవ  గంధర్వుల గాన మాధుర్యం అందాలి 

మాట

మాట

మాట ఓ ఆటలా ఉండాలి
దాని నుండి పాట  వినిపించాలి
సెలయేటి నీటిలా సునాయాసంగా సాగి పోవాలి
ఆ నీటి తేట లో బరువు గుండెలు సేద తీర్చుకోవాలి
మనసు లోని  గాయాలు మాయమవ్వాలి
నీ గుండెలోని తీపి తేనియ ను వినువారి నాలిక్కి అందించాలి
తీపి  తింటున్నానా  లేక వింటున్నానా 
అనుకునేట్లు
అనుకోనట్లూ
చల్లగా మెత్తగా పలికించు
అందమైన పరిమళాలు కురిపించు 

పండుగలూ పబ్బాలూ

పండుగలూ పబ్బాలూ
నోములూ వ్రతాలూ
ఇప్పుడు ఇసుక మేట వేసిన ఆనకట్టలు

ఒకప్పుడు వీటిద్వారా
చేతన విద్యుథ్చక్తిలా
ప్రవహించేది
జీవనం ఆనందమయం గావించేది
ఇప్పుడూ   ఇవన్నీ ఉన్నాయి , ఫిజికల్ గా  మాత్రమే
చేతనా విద్యుత్తు ప్రవహించడం లేదు 
ఇసుక మేటలు తీసి వేయ్
విద్యుత్  ప్రవాహాన్ని ఏర్పాటు చేయ్ 

Monday, January 26, 2015

ఎవరు

ఎవరు

 చేతుల్నీ కాళ్ళనీ
నేను నా ఇష్టప్రకారం ఆడిస్తున్నాను
కానీ
గుండెని ??
గుండె ఎవరి ఇష్టప్రకారం ఆడుతూందో  

సాగిపో

సాగిపో

కళా సాధకుడా
ప్రేక్షకుల ప్రశంసాభినందనలతో ఆగకు
వారి వహ్వాలు
నీకు పైమేట్టుకు ఆహ్వానాలు

కావు అవి
నీ లక్ష్యసాధనకు చిహ్నాలు

ఇంకా నీవు ముందుకు పోవాలి
వారి వహ్వాలు నీ పూజలుగా మారాలి
ప్రశంసలు నీ ఆరాధనగా మారాలి

నీ ద్వారా
వారి కళాభిలాష
కళా పిపాసగా మారాలి
వారు కళా తపస్వులుగా ఎదగాలి
కళగా పెరగాలి  

జీవించు అలవోకగా

జీవించు అలవోకగా
ఓ ఈకగా
తేలికగా
సాధించు అవలీలగా
లీలగా
అతని లీలగా



మంచితనం ఎక్కడ ఉంది

మంచితనం ఎక్కడ ఉంది

మంచితనం కావలసినంత ఉంది
మనలో
మనసులో
మనసు లోతుల్లో 

దాగిన విషయాలు

దాగిన విషయాలు
ఏ  రాగాల లొ   ఏ లెక్కలు దాగి యున్నవో
ఏ రాళ్ళ లో   ఏ దేవుళ్ళు వేచి యున్నారో

Friday, January 23, 2015

ఆనంద భాండాగారపు

ఆనంద భాండాగారపు
తలుపులు   తట్టాను
తాళాలు విడగోట్టాను
నాడులలో సంచలనం
చేతనా ప్రచలనం
క్రొత్త దారులు వెతుకుకుంటున్నాను నాలో
క్రొత్త ప్రదేశాలను దర్శిస్తున్నాను ఏవేవో
స్పర్శిస్తున్నాను, తీసుకొస్తున్నాను నా ఏలుబడిలో 




Sunday, January 4, 2015

నువ్వా నేనా

నువ్వా నేనా 

దేవుడు లేడంటున్నారు కొందరు
వున్నది మేమే అని వీరి పొగరు 

మీరు లేరంటున్నాడు   దేవుడు 
వున్నది నేనే అని వీడి వాగుడు 

దేవుణ్ణి మేమే సృష్టించామని కొందరి  అహంకారం 
మిమ్మల్ని నేనే సృష్టించానని దేవుడి దురహంకారం 

 నాలో ప్రాణమై నను పెంచుతున్నావు నీవు
నేనుండి నీ ప్రాణమై నిను పెంచుతున్నాను నేను 

నేనున్నాను నీవుగా 
నీవున్నావు నేనుగా  

జీవితమే వొక పండుగ 
చాలించు వాదాలు  దండుగ 

Saturday, January 3, 2015

poetry is కవిత ఓ పొంగు

poetry is 
కవిత ఓ పొంగు
భావాల పొంగు
పట్టరాని ఆనందపు హంగు
ఎనలేని ఉత్సాహపు రంగు
అది మంచి మాటల వెల్లువ
మాటల్లోని మంచి యొక్క విలువ

a overflow of creativity
expressed in terms of deep and subtle emotions
which are not bound by any limitations of the so called rationality
it's a play like that of  child,playing with it self 
craving for a dynamic action for a fast progress
it's a flow of orderliness,it's value 
it's a flow of lowered entropy structure of words, 
not just feelings and emotions