Thursday, July 2, 2026

 మేలుకోలుపు


నేను నిదుర మేల్కొన్నాను

అందరినీ మేల్కొలుపుతున్నాను


ప్ రభాత రాగాలను పాడు చున్నాను

శుభ ముహూర్తాలతో కరచాలనం చేసి


కార్య రంగం వైపు ఉరకలు వేస్తున్నాను

విజయానిక ి ప్రాణమైన సత్తును


మనసు నిండా నరాలనిండా

వొంటినిండా నింపుకొని


ఘనవిజయానికి పునాదులు వేస్తున్నాను

విశ్వ విజయానికి నినాదాలు చేస్తున్నాను


విజయీభవ

ది గ్విజయీభవ


అవుతూవున్న ది విజయం నాదే

కాబోతూంది స్వంతం ఈ విశ్వం నాకే


పొద్దు వాలకముందే విజయున్ని అవుతున్నాను

ధనంజయున్ని అవుతున్నాను


జయమాలలతో అలంకరించుకొని

విజయఫలా లు సంచీలనిండా నింపుకొని


ీ కటి కాకమునుపే ఇలు చేరుకుంటున్నాను

తలిదం డ్రుల ఆశీస్సులను అందుకుంతున్నాను


శ్రీర స్తు శుభమస్తు

సకలసిద్ది ప్రాప్తిరస్తు

No comments:

Post a Comment