Sunday, October 5, 2025

 🌹🚩 శ్రీ సరస్వతి స్తోత్రం — భావార్ధం (తెలుగులో) 🚩🌹

శ్లోకం:

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్రవస్త్రావృతా |

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |

యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా |

సా మాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

భావార్ధం:

కుందపుష్పమువంటి శుభ్రమైనది, చంద్రుడి కాంతిలా వెలిగే రూపవతి,

తుషారహారముతో (మంచు ముత్యాల హారముతో) అలంకరించబడినది,

శుభ్రమైన వస్త్రధారణతో శోభిస్తోన్నది,

చేతులలో వీణను, వరముద్రను ధరించినది,

శ్వేతపద్మంపై ఆసీనమైనది,

బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడుతున్నది —

అటువంటి జగద్గురువు, జ్ఞానదాయకురాలు,

అజ్ఞానాన్ని నశింపజేసే భగవతీ సరస్వతీ దేవి నా రక్షణ చేయాలి. 🙏🏿

🌼 అర్థసారం:

ఈ శ్లోకం ద్వారా మనం జ్ఞానమూర్తి సరస్వతీదేవిని ఆవాహన చేస్తాం.

ఆమె మనలోని మందమతి, జడత్వం, అజ్ఞానం తొలగించి,

జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తాం

గమనిక :"కుంద పుష్పం" (कुन्द पुष्पम् / Kunda Pushpam) అంటే —

తెలుగులో జాజి పువ్వుకు దగ్గరగా ఉండే ఒక తెల్లని, సువాసనగల పువ్వు.

🌸 వివరంగా:

శాస్త్రీయ నామం: Jasminum multiflorum

సాధారణంగా పిలిచే పేర్లు:

తెలుగు: కుంద పువ్వు

సంస్కృతం: కుంద, కుందపుష్పం

ఆంగ్లంలో: Star Jasmine లేదా Downy Jasmine

🌼 లక్షణాలు:

ఈ పువ్వు చిన్నది, తెలుపు రంగులో, తేజోవంతమైనది.

దీనికి తీయని వాసన ఉంటుంది.

చాలా సందర్భాల్లో శ్రీ సరస్వతీదేవి లేదా పవిత్రతకు సంకేతంగా ఈ పువ్వును వాడుతారు.

సంస్కృత సాహిత్యంలో "కుందపుష్ప ధవళా" అనే పదజాలం అంటే “కుందపువ్వులా తెల్లగా, పవిత్రంగా ఉన్నది” అని అర్థం.

🌹శ్లోకంలోని భావం:

"యా కుందేందు తుషారహార ధవళా"

అంటే —

కుందపువ్వు, చంద్రుడు, మంచు — వీటిలా తెల్లగా వెలిగే ఆమె (సరస్వతీదేవి) ఎంత పవిత్రమైనదో చెప్పడం

.“శ్వేత పద్మం” (श्वेत पद्मम् / Shveta Padmam) అంటే —

తెల్ల కమలం లేదా శుభ్రమైన కమలపువ్వు 🌸

🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

Saturday, October 4, 2025

 అనంత సూక్ష్మం 


సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది 

అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది 


నిశ్శబ్దసాగరం లో దాగి వుంది 

సమస్త శబ్ద సామ్రాజ్యం 


రెండు స్వరాల మధ్య అమరివుంది 

అనంతమైన స్వర సందోహం   


రెండడుగులతో వ్యాపించాడు వామనుడు 

విశ్వం సమస్తం 


Infinite subtlety…..

In the finest subtlety infinity is hidden 

Inner eye sees infinite universe

 In the ocean of silence is hidden 

the total kingdom of noise

Between two svaras 

infinite crowd of svaras is existing

With two feet vaman expanded in the universe total

Friday, October 3, 2025


 Telugu   kannada  Urdu    Hindi

Marati      bengal   panjabi

Tamil   malayalam   Gujarat i

 Sumati   vemana  krishna    narasimha    ;bhaskara    dasrathia

Bharthruhari   kavitha   kAlavishvsve vara  srinatha

Kalidasa     nannaya   Tilkkana   pothana

Errapragada

Sunday, September 28, 2025

 అనంత సూక్ష్మం 


సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది 

అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది 


నిశ్శబ్దసాగరం లో దాగి వుంది 

సమస్త శబ్ద సామ్రాజ్యం 


రెండు స్వరాల మధ్య అమరివుంది 

అనంతమైన స్వర సందోహం   


రెండడుగులతో వ్యాపించాడు వామనుడు 

విశ్వం సమస్తం 


Infinite subtlety…..

In the finest subtlety infinity is hidden 

Inner eye sees infinite universe

 In the ocean of silence is hidden 

the total kingdom of noise

Between two svaras 

infinite crowd of svaras is existing

With two feet vaman expanded in the universe total

Sunday, September 21, 2025

 ఊరికే వుండు


అన్నీ సర్దుకుంటాయి

 అందం 

మొగ్గ అందం 

పూవు అందం 

కాయ అందం 

పండు అందం

ఆకు అందం 

రేకు అందం 

కొమ్మ అందం 

రెమ్మ అందం 

చిగురాకు అందం 

ఎండిపోయిన ఆకు అందం 

రాలుతున్న బెరడు అందం 

చెట్టు అందం 

పిట్టా అందం 

గుట్ట అందం 

పుట్ట  అందం 

పుట్ట లోని పాము అందం 

చీమ అందం 

దోమ అందం 

నింగి పైన మామ అందం 

పూర్ణమదః పూర్ణ మిదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే

 అ ఆ లు

అ ఆ లు నేర్చుకుందాం 

ఆశయాలు నేరవేర్చుకుందాం

ఇ ఈ ల తో ఆడుకుందాం 

ఈ ఇలను కలలతో నింపుకుందాం

ఉ ఊ ల ఉయ్యాలలో

ఊగుదాం

ఋ రూ ల రుచులు

చవి చూదాం

లులూలను గురించి 

తెలుసుకుందాం 

ఎ ఏ ఐ ఓ ఓ ఔ లను 

ఔరా అనిపించుదాం

అం అః లతో 

ఆహా ఓహో అని ఆశ్చర్యపరుద్దాం

let's learn abcd

let's fulfill aspirations

let's learn efgh

let's fill this earth with dreams

let's learn ijkl

let's swing in the cradles

let's learn mnop

let's enjoy of taste of these

let's learn qrst

let's learn what they are

let's learn uvw

let's win marvels

let's learn xyz

let's make all flabbergast

 అక్షరం నేర్చుకో

లక్ష్యం సాధించుకో

అవకాశాలు సృష్టించుకో

అవధులు దాటి సాగి పో

జ్యోతితో జీవనం వెలిగించు

నీతి తో ఆనందం ఆరగించు