Sunday, January 22, 2023

ఇహం పరం

 ఇహం పరం

కడిగిన ముత్యంలా
సానబెట్టిన వజ్రంలా
వెలుగుజిమ్మే రత్నంలా
ఉండాలనుకుంటే …….
తీయని కలగా
కమ్మని రుచిగా
వెన్నెల రేయిగా
మారాలనుకుంటే …………….
పదునుపెట్టిన చాకులా
ఎదురులేని మాటలా
గురితప్పని బాణంలా
కావాలనుకుంటే ……………..
ఊహల అంచులకు
గుండెలలోతులకు
నీ దేవుడి చేరువకు
చేరాలనుకుంటే ……………..
సులువైన సాధనం
భావాతీత ధ్యానం

No comments:

Post a Comment