నేనొక వృక్షాన్ని
ఎదుగు తూన్న కల్పవృక్షాన్ని
పొంగి ఫొరలుతూన్న మకరంద బాండాన్ని
మధురోహను
మధురిమను
అందాన్ని ఆనందాన్ని
కవితను
కావ్యాన్ని
కవిని
జ్ఞానాన్ని
శాస్త్రాన్ని
వేదాన్ని
నేనొక వృక్షాన్ని
ఎదుగు తూన్న కల్పవృక్షాన్ని
పొంగి ఫొరలుతూన్న మకరంద బాండాన్ని
మధురోహను
మధురిమను
అందాన్ని ఆనందాన్ని
కవితను
కావ్యాన్ని
కవిని
జ్ఞానాన్ని
శాస్త్రాన్ని
వేదాన్ని
అంతర్ దర్శన్ టీవీ లో
వ్యక్త అవ్యక్తాల మధ్య ఆటల పోటీ
దేశకాల పరదాకు ఇరువైపులా వీరిద్దరి భలే సరదాలు
జరుగుతూనే ఉంది
నిత్యం డ్రా అవుతూ వుంది
ఎందుకంటే
అవ్యక్తం అంటోంది నేను హద్దుల్లేని అనంతాన్ని అని
వ్యక్తం అంటోంది నేను హద్దులు కలిగిన అనంతాన్నిఅని
అవ్యక్తం అంటోంది నేను ఏ పరిమాణం లేనిదాన్ని అని
వ్యక్తం అంటోంది నువ్వు ఉండడానికి నేనే నీకు
అన్ని పరిమాణాలు ఉన్న ఇండ్లు కట్టించాను
నీకు అద్దెకిచ్చాను అని
అవ్యక్తం అనుకుంది వ్యక్తాన్ని కాల్చి వడబోసి
నిఖార్సయిన అవ్యక్తం గా మారుద్దాము అని
తక్షణం
మంటలు తగిలించాడు మార్తాన్డుడు
ఆ మంటల సెగలు తగిలి సృష్టి పరిణితి అవుతూ ఉంది
శుద్ద్ద చైతన్యం వైపు పరుగెడుతూ వుంది
నారాయణుని చేరి నవ్యమవుతూ ఉంది
సమాధానం తెలిసి అవ్యక్తం అవుతూ వుంది
ఏమీ తెలియక ఎంతో గడ్డి తిన్నాను
కుడితి నీళ్ళు తాగాను
సైన్సు టెక్నాలజీ నేర్చాను
చేతనా స్రవంతిలో అంతా పారబోషాను
అంతా ఎంతో విలువ సంపాదించుకొంది
పాలలా అమృతంలా
వెలికి వస్తూ వుంది
ఏమేమో చేద్దామని దేవుడి దగ్గిర కెళ్ళాను
ఏమీ చేయక్కరలేని దేవుడినయ్యాను
అందం
మొగ్గ అందం
పూవు అందం
కాయ అందం
పండు అందం
ఆకు అందం
రేకు అందం
కొమ్మ అందం
రెమ్మ అందం
చిగురాకు అందం
ఎండిపోయిన ఆకు అందం
రాలుతున్న బెరడు అందం
చెట్టు అందం
పిట్టా అందం
గుట్ట అందం
పుట్ట అందం
పుట్ట లోని పాము అందం
చీమ అందం
దోమ అందం
నింగి పైన మామ అందం
పూర్ణమదః పూర్ణ మిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
అక్షరం నేర్చుకో
అంతర్ దర్శన్ టీవీ లో
వ్యక్త అవ్యక్తాల మధ్య ఆటల పోటీ
దేశకాల పరదాకు ఇరువైపులా వీరిద్దరి భలే సరదాలు
జరుగుతూనే ఉంది
నిత్యం డ్రా అవుతూ వుంది
ఎచట నుండి వూరుతూన్నదీ కవిత
అనుక్షణం ఉదయించే నవ్యత
కవిత నవ్యతా ఝరి
సృజనతో నిండిన కుండ చేసే చప్పుడు
నిండుకుండ చేసే చప్పుడు
నిండైన నిశ్శబ్దం చేసే అలజడి
ఇహం పరం సాధించాలనుకుంటే
కడిగిన ముత్యం లా
సానబెట్టిన వజ్రంలా
వెలుగుజిమ్మే రత్నంలా
ఉండాలనుకుంటే
తీయని కలగా
కమ్మని రుచిగా
వెన్నెల రేయిగా
మారాలనుకుంటే
పదునుపెట్టిన చాకులా
ఎదురులేని మాటలా
గురితప్పని బాణంలా
కావాలనుకుంటే
ఊహల అంచులకు
గుండెలలోతులకు
నీ దేవుడి చేరువకు
చేరాలనుకుంటే
సులువైన సాధనం
భావాతీత ధ్యానం
ఖగోళ వ్యాపారంలో గోళీల కేళీవినోదం
పరమపురుషుని వేళా కోళం
సూర్య భువనజ్ఞానం
భగ భగ మంటల్లో హాయిగ నిద్రించి వుంది
ఒక చల్లని ప్రకృతి సూత్రం
సూర్యనారాయణ తత్వం