Wednesday, March 4, 2026

 సాగిపో

కళా సాధకుడా

ప్రేక్షకుల ప్రశంసాభినందనలతో ఆగకు

వారి వహ్వాలు

నీకు పైమేట్టుకు ఆహ్వానాలు

కావు అవి

నీ లక్ష్యసాధనకు చిహ్నాలు

ఇంకా నీవు ముందుకు పోవాలి

వారి వహ్వాలు నీ పూజలుగా మారాలి

ప్రశంసలు నీ ఆరాధనగా మారాలి

నీ ద్వారా

వారి కళాభిలాష

కళా పిపాసగా మారాలి

వారు కళా తపస్వులుగా ఎదగాలి

కళగా పెరగాలి

 సాయుధ విప్లవం

విప్లవ యోధుల్లారా

మీ ఆయుధాలు పదునుగా ఉన్నాయా

పోరాడడానికి మీ శరీరాలు తయారుగా ఉన్నాయా

మీ శరీరం లో వేడి రక్తం వురకలేస్తోన్దా

బండరాల వంటి కండరాళ్ళు మీకున్నాయా

విప్లవం విజయం పొందేందుకు

విజయవంతంగా నడిపించేందుకు

వ్యూహాల ు పన్నడం మీకు చేతనవుతుందా

బుధి కుశలతా ,మానసిక స్థైర్యం , ఆత్మ విశ్వాసం  మీకున్నాయా

లేక

చచ్చిన పాముల్లా , తుమ్మితే  ఊడే ముక్కుల్లా

గానుగ ఎద్దుల్లా , కూపస్థ మండూకాల్లా వున్నారా మీరు

వట్టి ఆవేశాలు , ఉత్తుత్తి వేషాలు పనికి రావోయ్

కావాలి నిజమైన నికార్సైన ఉద్యమం

అదే సత్య సాధనం , నిజమైన సాధనం

సత్య అనుసంధానం చేసుకో

నిత్య విజయాలు అందుకో

 జయమ్ము నిశ్చయమ్మురా

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

ఏనాటికైన స్వార్ధము నశించి తీరును

ఏనాటికైన స్వార్ధము నశించి తీరును

ఏరోజుకైన సత్యమే జయించి తీరును.. జయించి తీరును

కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి .

విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి

విశాల దృష్టి తప్పకుండ బోధించాలి .. బోధించాలి

పెద్దలను గౌరవించి పూజించాలి .. పూజించాలి

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును .. సుఖాలు దక్కును

ఈ లోకమందు సోమరులై ఉండకూడదు .. ఉండకూడదు

పవిత్రమైన ఆశయాన మరువకూడదు .. మరువకూడదు

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా .. బ్రోవుము దేవా

కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా .. నడుపుము దేవా

బీదసాదలాదరించు బుద్ది నొసగుమా .. శక్తి నొసగుమా

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

గాఢాంధకారమలముకున్న భీతిచెందకు

సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు .. సాగుముందుకు

నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు … క్రుంగదీయకు

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా

పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్…

జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్.. పోరి గెల్వవోయ్

స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ .. నిల్వబెట్టవోయ్

Saturday, January 17, 2026

  అనంత సూక్ష్మం 

సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది 

అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది 

నిశ్శబ్దసాగరం లో దాగి వుంది 

సమస్త శబ్ద సామ్రాజ్యం 

రెండు స్వరాల మధ్య అమరివుంది 

అనంతమైన స్వర సందోహం   

రెండడుగులతో వ్యాపించాడు వామనుడు 

విశ్వం సమస్తం 

Infinite subtlety…..

In the finest subtlety infinity is hidden 

Inner eye sees infinite universe

 In the ocean of silence is hidden 

the total kingdom of noise

Between two svaras 

infinite crowd of svaras is existing

With two feet vaman expanded in the universe total

Sunday, November 16, 2025

 తెలుగు మనకు  వెలుగు 

తెలుగుతో చందురుని వెన్నెలలా హాయి కలుగు

 ఎటు పయనం

ముందు నుయ్యి వెనుక గొయ్యి

అటు  పెన్నం ఇటు పొయ్యి

పైన అందని  ఆకాశం

కింద అంతు లేని పాతాళం

కనుకనే కినుక మాను

అటు పోకు ఇటు రాకు

నీ అంతరంగం సకల శ్రీరంగం

తరగని ఆనందం

కదలకు మెదలకు

ఉండు ఇక్కడే

ఇపుడూ ఎపుడూ

 చేతనా సకల సిద్ధి ప్రదాయినీ

ఎందుకనగా

యతీనాం బ్రహ్మా భవతి సారథి