Saturday, November 12, 2016

ఎందుకు ?

ఎందుకు ?

ఎందుకు రాయాలి ?
ఎందుకు పని చేయాలి?

విశ్వం ఇలా ఎవాల్వ్ అవుతూ ఉంది కదా 
అందుకే రాయడాలూ , చేయడాలూ 
అన్నీ ఎవల్యూషన్ యొక్క స్టెప్స్ 
కనుక రాయాలీ చేయాలీ 

మోసపోకు

మోసపోకు 
సైన్సు పుస్తకాల్లో లేదు 
లాబొరేటరీల్లో లేదు 
నీలో ఉంది 

your self moving within itself 
you discover the laws of nature
you discover the scientific principles

Tuesday, October 18, 2016

సత్యాన్వేషణ అత్యాకర్షణ

సత్యాన్వేషణ అత్యాకర్షణ
కాదది నిత్య సంఘర్షణ 
కష్టం సంఘర్షణ 
ఇష్టం ఆకర్షణ 
కొనసాగించు అన్వేషణ 
పొందు సత్యాకర్షణ 
కా  నువు  దానికి సమర్పణ 
అవుతుందపుడు విశ్వం  సంపూర్ణ     
పూర్తిగా కృష్ణార్పణ 
గణ గణ గణ గణ 


Sunday, August 28, 2016

ప్రతి సమస్యకూ సమాధానం

ప్రతి సమస్యకూ సమాధానం దొరుకున్న తరుణం ఇది
సమస్యలన్నీ సమసిపోతున్న శుభ సమయం ఇపుడు

సైన్సు టెక్నాలజీలకు
వేద శాస్త్రాల అనుసంధానం అవుతున్న వేళ  ఇది
ఇంకెందుకు బాధలూ వేదనలూ

అంతా ఆనందం తో కళ  కళ  లాడే
కళ్యాణ ఘడియలివి 

Friday, August 26, 2016

పదునాలుగు భువనంబులు

పదునాలుగు భువనంబులు 
పడి వున్నాయి నీ ముందు 
సంచరించు అందు 

Wednesday, August 24, 2016

అనంత సూక్ష్మం

అనంత సూక్ష్మం 

సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది 
అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది 

నిశ్శబ్దసాగరం లో దాగి వుంది 
సమస్త శబ్ద సామ్రాజ్యం 

రెండు స్వరాల మధ్య అమరివుంది 
అనంతమైన స్వర సందోహం   

రెండడుగులతో వ్యాపించాడు వామనుడు 
విశ్వం సమస్తం 

ఉపాయం

ఉపాయం 

కార్యాన్ని సాధించాలా ?
అయితే 
చేతనను సంఘటితం చేసుకో