1 వసంత కవిత
.Rishi Vasanth Brahmachari
Tuesday, October 18, 2016
సత్యాన్వేషణ అత్యాకర్షణ
సత్యాన్వేషణ అత్యాకర్షణ
కాదది నిత్య సంఘర్షణ
కష్టం సంఘర్షణ
ఇష్టం ఆకర్షణ
కొనసాగించు అన్వేషణ
పొందు సత్యాకర్షణ
కా నువు దానికి సమర్పణ
అవుతుందపుడు విశ్వం సంపూర్ణ
పూర్తిగా కృష్ణార్పణ
గణ గణ గణ గణ
Sunday, August 28, 2016
ప్రతి సమస్యకూ సమాధానం
ప్రతి సమస్యకూ సమాధానం దొరుకున్న తరుణం ఇది
సమస్యలన్నీ సమసిపోతున్న శుభ సమయం ఇపుడు
సైన్సు టెక్నాలజీలకు
వేద శాస్త్రాల అనుసంధానం అవుతున్న వేళ ఇది
ఇంకెందుకు బాధలూ వేదనలూ
అంతా ఆనందం తో కళ కళ లాడే
కళ్యాణ ఘడియలివి
Friday, August 26, 2016
పదునాలుగు భువనంబులు
పదునాలుగు భువనంబులు
పడి వున్నాయి నీ ముందు
సంచరించు అందు
Wednesday, August 24, 2016
అనంత సూక్ష్మం
అనంత సూక్ష్మం
సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది
అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది
నిశ్శబ్దసాగరం లో దాగి వుంది
సమస్త శబ్ద సామ్రాజ్యం
రెండు స్వరాల మధ్య అమరివుంది
అనంతమైన స్వర సందోహం
రెండడుగులతో వ్యాపించాడు వామనుడు
విశ్వం సమస్తం
ఉపాయం
ఉపాయం
కార్యాన్ని సాధించాలా ?
అయితే
చేతనను సంఘటితం చేసుకో
Tuesday, August 23, 2016
శాస్త్రం , సంగీతం
శాస్త్రం , సంగీతం
శాస్త్రీయ సంగీతం సాధించు
శాస్త్రాన్ని వదలు
సంగీతాన్ని పదిలపరచు
సాగర గర్భాన్ని చేరవలసియుండగా
పడవను అంటిపెట్టుకు కూర్చోడం దండగా
పూబంతి ఆట
పూబంతి ఆట
దేవీ దేవతలు
ఐక్య క్షేత్రాన్ని ఓ పూబంతిగా చేసుకొని
సరస సల్లాపాలు సాగిస్తున్నారు
అన్నీ తెలిసినా
అమాయకుల్లా ఆడుకుంటున్నారు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)