Sunday, September 28, 2025

 అనంత సూక్ష్మం 

సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది 

అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది 

నిశ్శబ్దసాగరం లో దాగి వుంది 

సమస్త శబ్ద సామ్రాజ్యం 

రెండు స్వరాల మధ్య అమరివుంది 

అనంతమైన స్వర సందోహం   

రెండడుగులతో వ్యాపించాడు వామనుడు 

విశ్వం సమస్తం 

Infinite subtlety…..

In the finest subtlety infinity is hidden 

Inner eye sees infinite universe

 In the ocean of silence is hidden 

the total kingdom of noise

Between two svaras 

infinite crowd of svaras is existing

With two feet vaman expanded in the universe total

Sunday, September 21, 2025

 ఊరికే వుండు

అన్నీ సర్దుకుంటాయి

 అందం 

మొగ్గ అందం 

పూవు అందం 

కాయ అందం 

పండు అందం

ఆకు అందం 

రేకు అందం 

కొమ్మ అందం 

రెమ్మ అందం 

చిగురాకు అందం 

ఎండిపోయిన ఆకు అందం 

రాలుతున్న బెరడు అందం 

చెట్టు అందం 

పిట్టా అందం 

గుట్ట అందం 

పుట్ట  అందం 

పుట్ట లోని పాము అందం 

చీమ అందం 

దోమ అందం 

నింగి పైన మామ అందం 

పూర్ణమదః పూర్ణ మిదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే

 అ ఆ లు

అ ఆ లు నేర్చుకుందాం 

ఆశయాలు నేరవేర్చుకుందాం

ఇ ఈ ల తో ఆడుకుందాం 

ఈ ఇలను కలలతో నింపుకుందాం

ఉ ఊ ల ఉయ్యాలలో

ఊగుదాం

ఋ రూ ల రుచులు

చవి చూదాం

లులూలను గురించి 

తెలుసుకుందాం 

ఎ ఏ ఐ ఓ ఓ ఔ లను 

ఔరా అనిపించుదాం

అం అః లతో 

ఆహా ఓహో అని ఆశ్చర్యపరుద్దాం

let's learn abcd

let's fulfill aspirations

let's learn efgh

let's fill this earth with dreams

let's learn ijkl

let's swing in the cradles

let's learn mnop

let's enjoy of taste of these

let's learn qrst

let's learn what they are

let's learn uvw

let's win marvels

let's learn xyz

let's make all flabbergast

 అక్షరం నేర్చుకో

లక్ష్యం సాధించుకో

అవకాశాలు సృష్టించుకో

అవధులు దాటి సాగి పో

జ్యోతితో జీవనం వెలిగించు

నీతి తో ఆనందం ఆరగించు

Friday, June 7, 2024

కానీ నా శేష జీవితం

కానీ నా శేష జీవితం 

ముక్తికి సోపానం  

Monday, October 2, 2023

జ్యోతిష్మతి ఇదే నిజమైన హారతి ఇది ముక్కంటి మూడో నేత్రం

 

జ్యోతిష్మతి 
ఇదే నిజమైన హారతి
ఇది ముక్కంటి మూడో నేత్రం

చక్కంటి త్రికాల జ్ఞాన విచిత్రం
చేతనా కిరణ కాంతి పుంజం

ఒక్కొక్క కిరణం అమూల్య ఆభరణం
చేస్తుంది ప్రసరణం , ప్రక్షాళనం ,

పునీతం, ధన్యం

అక్షర క్షేత్రం లోని ఓనమాలు నేర్పిస్తుంది

ఋక్కుల బుక్కులను చదివిస్తుంది

 

చమురు లేని దివ్వెను వెలిగిస్తుంది
తిమిరాన్ని పారద్రోలుతుంది

కోటి కవాటాలను పారదర్శకంగా దాట నిస్తుంది

గర్భగుడికి దారి చూపిస్తింది

చెత్త చెదారం చిత్తుగా పలాయనం

దేవీదేవతల గమ్మతుగా ఆవాహనం

 

ఈ హారతి వెలుగుల్లో భారతి చల్లన్ని నవ్వుల్లు

మణిహారాల జిలుగుల్లు

 

మెరుగు చేస్తుంది ఈ మెరుగు

ఇది నిజము ఎరుగు ఎరుగు 


jyothishmathi
this is the true haarathi

this is three-eyed siva's third eye
a nice wonder, knowledge of past present future

beam of rays of the transcendent consciousness
each ray is invaluable jewel

it radiates, purifies, 
ennobles, enriches

teaches the alphabets of knowledge structured in the field of transcendent
enables glance of books of richas [laws of nature]

lights the oil-less lamp 
drives away the darkness

enables crossing crores of doors transparently
leads the way to the sanctum sanctorium

dust dirt totally washed out
devi devathas are welcome in 

in the brightness of this haarathi, cool smiles, graces bharathi
gems in her laces glow

this light lights all to shine forsooth
know that it's truth

……..vasanth kavitha