అహో కలి యుగం
ప్రకృతి నియమోల్లంఘనం
అరిషడ్వర్గ స్వైర విహారం
రజస్తమాల ఉద్రిక్త రూపం
ఫలితంగా
కష్టం నష్టం, దుఃఖం ,దారిద్య్రం
పరాజయం, పరాభవం
రోగం ,అకాల మరణం
జన్మ వ్యర్థం , సర్వ నాశనం,
దీనికి తగ్గట్టు
ఘనంగా జరుపుకునే తద్దినాలు లాగ
సమస్యల తోరణాలు ప్రొజెక్ట్ చేసేందుకు
కలర్ ఫోటోలు , ప్రతిభావంతమైన వ్యాసాలూ , ఉపన్యాసాలు
కథలు, నాటకాలు, రేడియో టీవీ కవరేజులూ
వీటికి అవార్డులు రివార్డులూను
ఇంకా ,
చీకట్లో వదిలే బాణాల్లాంటి ఫలితం ఇవ్వని పరిష్కారాలు
ఆపండి చాలు ఈ వ్యర్థ జీవనం
మాట్లాడండి ధ్యాన సాధకులతో వారి అనుభవ గాథలు
వినండి ధ్యాన శిక్షకులు చెప్పే ఆనంద బోధలు
నేర్వండి ధ్యాన పధ్ధతి
ఇవ్వండి మీ మనశ్శరీరాలకు 20 నిమిషాల విశ్రాంతి
తొలగుతుంది భ్రాంతి, వెలుగుతుంది నిజమైన కాంతి
అందుకే అంటాను
ఎందరో ధ్యాన సాధక మహానుభావులు
అందరికీ వందనాలు
శిశిరంలో వసంతంలా
కలియుగంలో సత్యయుగాన్ని చిగురింప చేస్తున్నారు
సంతోషం, సమాధానం, ఆనందం, వివేకం
శాంతం, సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం
అమృతం, జ్ఞానం, సాఫల్యం ,
కామక్రోధాలపై సహజ నియంత్రణ
త్రిగుణాల సమతులనం,
ప్రకృతి నియమానుసార జీవితం
స్వర్గసుఖాల నిత్యానుభవం
చవి చూస్తున్నారు, చూపిస్తున్నారు ,