Sunday, August 28, 2016

ప్రతి సమస్యకూ సమాధానం

ప్రతి సమస్యకూ సమాధానం దొరుకున్న తరుణం ఇది
సమస్యలన్నీ సమసిపోతున్న శుభ సమయం ఇపుడు

సైన్సు టెక్నాలజీలకు
వేద శాస్త్రాల అనుసంధానం అవుతున్న వేళ  ఇది
ఇంకెందుకు బాధలూ వేదనలూ

అంతా ఆనందం తో కళ  కళ  లాడే
కళ్యాణ ఘడియలివి 

Friday, August 26, 2016

పదునాలుగు భువనంబులు

పదునాలుగు భువనంబులు 
పడి వున్నాయి నీ ముందు 
సంచరించు అందు 

Wednesday, August 24, 2016

అనంత సూక్ష్మం

అనంత సూక్ష్మం 

సూక్ష్మాతి సూక్ష్మం లో అనంతం ఇమిడి వుంది 
అంతర్ నయనం అనంత విశ్వం సందర్శిస్తుంది 

నిశ్శబ్దసాగరం లో దాగి వుంది 
సమస్త శబ్ద సామ్రాజ్యం 

రెండు స్వరాల మధ్య అమరివుంది 
అనంతమైన స్వర సందోహం   

రెండడుగులతో వ్యాపించాడు వామనుడు 
విశ్వం సమస్తం 

ఉపాయం

ఉపాయం 

కార్యాన్ని సాధించాలా ?
అయితే 
చేతనను సంఘటితం చేసుకో 

Tuesday, August 23, 2016

శాస్త్రం , సంగీతం

శాస్త్రం , సంగీతం 

శాస్త్రీయ సంగీతం సాధించు 
శాస్త్రాన్ని వదలు 
సంగీతాన్ని పదిలపరచు 

సాగర గర్భాన్ని చేరవలసియుండగా 
పడవను అంటిపెట్టుకు కూర్చోడం దండగా 

పూబంతి ఆట

పూబంతి ఆట

దేవీ దేవతలు
ఐక్య క్షేత్రాన్ని ఓ పూబంతిగా చేసుకొని
సరస సల్లాపాలు సాగిస్తున్నారు
అన్నీ తెలిసినా
అమాయకుల్లా ఆడుకుంటున్నారు 

నిశ్శబ్ద స్పందన

నిశ్శబ్ద స్పందన

మనం ఏది చేయాలనుకున్నా
అది చేతన చేస్తున్న నిశ్శబ్ద స్పందన

అవ్యక్తం నుండి వ్యక్తం లోకి రావాలని
భగవంతుని ఆలాపన

తన మహిమలు వెలికి తీసుకొని వఛ్చి
విశ్వాన్ని అలరించాలని తపన

లోని దేవుణ్ణి మనం
వెలికి తీసుకొని వస్తున్నాం మన సాధన ద్వారా
మన దైనందిన జీవన సరళి ద్వారా 

ఉన్నత విద్య

ఉన్నత విద్య

శబరీ ఏ పేపరు చదివింది ?
గుహుడు ఏ డిగ్రీ సంపాదించాడు ?
తిన్నడు ఏ టీవీ చూశాడు ?
ధర్మవ్యాధుడు ఏ గ్రంథాన్ని వల్లెవేశాడు ?

ఆత్మ సందర్శనం
ఆత్మ అనుసంధానం
స్వధర్మం కన్నఉన్నతమైన
కార్యము కలదా ?

మహర్షీ

మహర్షీ
నీ నామము తలచుకున్నంతనే
మనసు విఛ్చుకొంటున్నది
దివికి దారి చూపిస్తున్నది

విచ్ఛుకున్న మనసే
స్వర్గానికి రహదారి
సర్వ సుఖాలకు సింహద్వారి