Thursday, October 1, 2015

సుగుణ మాసం వేడుకలు

సుగుణ మాసం వేడుకలు
{నవంబరు క్వాలిటీ మాసం గా ఎన్నుకోబడింది}

క్వాలిటీ క్వాలిటీ అని  గోల పెట్టాయి కాకులు
క్వాలిటీస్  ఆఫ్ ది యూనిఫైడ్ ఫీల్డ్ అని ఈల పాడాయి కోకిలలు

 క్వాలిటీని బజారులో కొందాం , ఫాక్టరీలో  తయారు చేద్దాం
అని తహ తహ లాడారు మహామహులు

కాదు, సుగుణాలవాలమైన ఐక్య క్షేత్రము నుండి అందుకొందాము
అని అవలీలగా అన్నారు ధ్యాన సాధకులు


 క్వాలిటీని చర్చలతో అర్చిద్దామని అరిచారు మేధావులు 
కాదు, నిశబ్దం తో అర్థిద్దామని సవరించారు చేతనా విద్యార్థులు 

క్వాలిటీ విదేశాలనుంచి వచ్చిందని పొగిడారు కొందరు 

కాదు, ఎక్కడ నేనున్నానో అక్కడ క్వాలిటీ వుంది అన్నాడు శ్రీ కృష్ణుడు 

నా నిజ స్వరూపం '' పరా క్షేత్రం '' క్వాలిటీకి జన్మస్థానం 


అని వివరించాడు పరమ పురుషుడు