Saturday, November 29, 2014

ప్రభూ నా పిలుపు నిను చేరక ముందే

, నీ పలుకు

ప్రభూ
నా పిలుపు నిను చేరక ముందే
నీ పలుకు నాకందే
నా పిలుపే నీ పలుకు

prabhu
before my call reached you
thy response reached me
my call is it self, thy response

you write to my soul
i read you in my soul

it's all soul to soul
thy soul is my soul

it's a song i sing ,solo 
i alone hear , lo!

Friday, November 28, 2014

పురుష ప్రతిభ

పురుష ప్రతిభ 

విశ్వం , ఇది ఒక దృశ్య కావ్యం

వ్యక్తావ్యక్తల సంమిశ్రనం 

 

కల్పనా వాస్తవికలతో సమ్మోహనం

ఇది నవరస భరితం , సకల కళా శోభితం

 

ప్రతిసన్నివేశం నవ నవోన్మేశం  

క్షణం క్షణం జీవితం ఉత్కన్ట్ట  జనితం 

 

నేపథ్యం అరణ్య నదీ నద పర్వత సాగరమయం

ఆకాశ సూర్య చంద్ర తారా మండలాలతో అలంకృతం

 

వైవిధ్య  వైరుధ్య  విపరీతాలతో రీతి సవ్యతల సఖ్యం 

ఇదొక జీవ నిర్జీవ ప్రతిమా నాటకం పురుష ప్రతిభా పాటవం

 

ఇందులో నీవొక ప్రేక్షకుడవే  కాదు ఒక పాత్ర ధారివి కూడా

దాని సూత్ర ధారివి కూడా  

 

నీ పాత్ర అతనిదొక చిరు అవతారం 

జగన్నాటక సూత్ర దారివిగా ఎదగడానికి  నీకిచ్చిన సదవకాశం

 

సాధించు రాణించు జయించు జగమేలు 

మెలమెల్లగా చల్లగా తీయగా హాయిగా 

the glory of supreme

universe is a visual poetic treat
a mix of visibles and invisibles, neat

full with 9 moods, bedecked with all arts
it is bewitching with fiction and facts

every scene ever a flow of novelty
moment to moment , suspense, a running commentary 

back drop rich with jungles, rivers, rivulets, mountains, oceans
well beautified with sky sun moon stars galaxies

variety, contradictions ,odds in friendship with harmony and order
this is a drama with living and nonliving dolls, the glory of supreme designer

in this you are not only a spectator but also an actor, 
and more its director

this your role is his a small incarnation
to enable you to grow into the stature of director of this drama of universe

accomplish, shine, win, and rule the universe
gradually, coolly, sweetly, blissfully